చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి రాజీనామా చేశారని తమిళ మీడియాలో గురువారం మద్యాహ్నం జోరుగా ప్రచారం జరిగింది. ఎడప్పాడి పళనిసామి రాజీనామా చెయ్యడంతోనే ఆయన కారు మీద ఎర్రబుగ్గలు తొలగించారని మీడియా కోడైకూసింది.
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు గురువారం ఒక్కటి అవుతున్నాయని ప్రచారం జరిగింది. గురువారం ఉదయం నుంచి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి తన నివాసంలో నిమిషం తీరకలేకుండా చర్చలు జరిపారు. అన్నీర్ సెల్వం సైతం సీఎం పళనిసామి ఇంటికి వస్తారని ప్రచారం జరగడంతో మీడియా అక్కడే తిష్టవేసింది.
Comments
Post a Comment